బాబు గారూ.. బాబు ఇలా ఉంటే కష్టం..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పొలిటికల్‌ స్టెప్స్‌బాగానే ఉన్నాయి కానీ.. ఆయన వ్యవహారశైలి పార్టీలో ముఖ్యంగా సీనియర్లకు నచ్చడం లేదు. దీంతో సీనియర్‌ నాయకులు లోకేష్‌పై గుస్సా అవుతున్నారు కానీ.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. అలాగే ఉండలేక సతమతమవుతున్నారు. అపాయింట్‌మెంట్‌ లేనిదే లోకేష్‌బాబు ఎవరినీ కలవడం లేదు. వారు సీనియర్లైనా..సామాన్య కార్యకర్తలైనా. కార్పొరేట్‌ స్టైల్లో లోకేష్‌ రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ పార్టీని అలాగే ఉండాలని చెబుతున్నాడు. అయితే సీనియర్లకు ఇవి మింగుడు పడటం లేదు. పార్టీ అధినేత అయిన చంద్రబాబునే తాము అపాయింట్‌మెంట్‌ అవసరం లేకుండా నేరుగా కలుసుకుంటాం.. ఈయన మాత్రం ఎందుకిలా అని తమలోతాము అసహనానికి గురవుతున్నారట.

సీనియర్‌ నాయకులు బుచ్చయ్య చౌదరి, జేసీ దివాకర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తదితరులు లోకేష్‌ ‘అపాయింట్‌ మెంట్‌’ కల్చర్‌తో విసిగిపోయారట. రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి రాజకీయాలను ఔపోసనపట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోకేష్‌ బాబు.. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని గమనించాలని, ఆయనలా పార్టీ నిర్వహణ చేయాలని కోరుతున్నారట. పార్టీ స్థాపించిన మొదట్లో జగన్‌..అప్పట్లో సీనియర్‌నాయకులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితరులను ఎలా మేనేజ్‌ చేసేవారు ఒకసారి చూడాలని చెబుతున్నారట. సాధారణంగా జనరేషన్‌ గ్యా్‌ప్‌ అనేది వస్తూంటుంది.. అయితే రాబోయే రోజుల్లో లోకేష్‌బాబుతో ఎలా వేగేది బాబూ.. అని పార్టీలో పలువురు సీనియర్లు తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

Share post:

Latest