మరో ప్రయోగానికి నాంది పలికిన అల్లరి నరేష్..

కితకితలు హీరో అల్లరి నరేష్ వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న అల్లరి నరేష్, ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను రూపొందిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో అట్టర్ ఫ్లాప్ ను చవి చూశాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వేరే సినిమాలు తీయవద్దు అని ఆలోచించాడు.అంతేకాదు ఈ మధ్య అలాంటి వార్తలు బాగా వచ్చాయి. మహేష్ బాబుతో మహర్షి సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితం అవతారు అనుకున్నారు. ఇక అల్లరి నరేష్ ఇలాంటి పాత్రలనే చేస్తాడని అనుకున్నారు. కానీ ఎవరు అనుకోని విధంగా నాంది సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.Naresh 58 First Look: Allari Naresh's next titled Sabhaku Namaskaram; To be  a hilarious entertainer

ఊహించని విధంగా సీరియస్ రోల్ లో చేస్తూ, ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈయన నవ్వించడమే కాదు ఏడిపించడంలో కూడా దిట్ట అని తెలిసింది. నాంది సినిమాలో ఏడిపించటం బాగా కనిపించింది. నాంది సినిమాతోనే ఈ అల్లరోడు వేరే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు.

ఇక ఈ మధ్యకాలంలో కొన్ని నెలల క్రితం నుంచి ” సభకు నమస్కారం ” సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను కొద్దికాలం కిందట అనౌన్స్ చేశాడు. కరోనా ఇతరత్రా కారణాల వలన సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఎలాగైతేనేమి సభకు నమస్కారం సినిమాలో అల్లరి నరేష్ నటించబోతున్నాడు. మహేష్ కొనేరు ఈ సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నాడు.

ఈ సినిమా కూడా అల్లరి నరేష్ కు మంచి సక్సెస్ ను సాధించిపెడుతుందని, అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు పొలిటికల్ పాత్రలో అల్లరి నరేష్ చేయలేదు. ఆయనకు ఈ సినిమా ఛాలెంజ్ గా నిలుస్తుంది. అల్లరి నరేష్ కొత్త సినిమాలు చూడటానికి ఆశిస్తున్నా, అభిమానులకు సభకు నమస్కారం సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. ఈ చిత్రం సినిమాకు రెగ్యులర్ గా షూటింగ్ లు జరుగుతున్నాయి ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని మనం కూడా భావిద్దాం ..

Share post:

Latest