వైరల్ ఫోటోస్ : వెకేషన్‌ ట్రిప్‌లో మహేశ్‌..!

ప్రిన్స్ మహేష్ బాబు అంటే చాలా మందికి ఇష్టం. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మేన్ గా అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన అనేక సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ ఆయన తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో కుటుంబీకులతో మహేష్ బాబు గడపలేకపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది.

గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ బాబు తన కుటుంబంతో గోవాకు ప్లాన్ చేశారు. అటు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు తన కుటుంబీకులతో సంతోషంగా గడుపుతున్నారు. కుటుంబం మొత్తం కలిసి ప్రత్యేక ఫ్లైట్ తో గోవాకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular