కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న కాజల్ అగర్వాల్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో తన అందచందాలతో, తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. అలాగే ఈమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.ఈమె గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

పెళ్లి తర్వాత కూడా అదేరీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా కాజల్ అగర్వాల్ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంది. అయితే అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.కాజల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఆచార్య, గోస్ట్ సినిమాలలో నటిస్తుంది.

Share post:

Latest