జాన్వీ కపూర్ ఎంత కష్టపడుతుందో.. కనీసం ఆ పని చేసేందుకు కూడా?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందరికీ సుపరిచితమే . జాన్వీ కపూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంబంధించిన వీడియోలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె ఆ వీడియో షేర్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీని తనదైన శైలిలో చూపించింది జాన్వీకపూర్. ఈ వీడియోలో ఆమె మొదట బికినీ టాప్ ధరించి సులభంగా మిషన్ నుంచి ఆరెంజ్ జ్యూస్ ను తీస్తోంది.అలాగే నీలి రంగు టాప్ చాట్ ధరించి కనిపించింది. ఈ వీడియోలో మాత్రం ఆమె జ్యూస్ ను తీయడానికి చాలా కష్టపడి పోయింది.

అయితే ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఈ వీడియోని నెటిజన్లు పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక జాన్వీకపూర్ విషయానికి వస్తే ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ కపూర్ చివరిసారిగా రూహి సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో ఆమెతో పాటు గా రాజకుమార్ రావు అలాగే వరుణ్ సినిమా నటించారు. ప్రస్తుతం జాన్వికపూర్ దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.