హీరోయిన్ ఛార్మి సంచలన నిర్ణయం !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది ఛార్మీ. ఇక ఈమె ఒకానొక సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈమె ఒక సంచలన నిర్ణయం తీసుకుందట.. అదేమిటో చూద్దాం.

- Advertisement -

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్ లోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది ఛార్మీ, సక్సెస్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ లైజర్ సినిమాతో చాలా బిజీగా ఉంది. ఛార్మి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాకు దగ్గర్లోనే ఉంటుంది.

సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన అప్డేట్ వంటివి ఇస్తూ ఉంటుంది. ఇక ఛార్మీ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఛార్మి ఈ మాట అనడం తో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఈమె ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అసలు కారణం ఉందని తెలుపుతున్నారు. ఛార్మికి ప్రస్తుతం ట్విట్టర్లో లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే చాలా మంది సన్నిహితులు మాత్రం తన సినిమాల వైపు చాలా బిజీగా ఉండడం వల్లే సోషల్ మీడియాకు విరామం ప్రకటించుకున్నది అని తెలిపారు.

అంతే కాకుండా ఛార్మి మరి హీరోయిన్ గా నటిస్తే, చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా ఛార్మి హీరోయిన్ గా నటిస్తుందో.. ఏమో చూడాలి. ఇక ఈమె పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తూ ఉండడం కూడా విశేషమే.https://twitter.com/Charmmeofficial/status/1422583466034556928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1422583466034556928%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffilmyfocus.com%2Ftelugu%2Factress-charmme-kaur-sensational-decision%2F

Share post:

Popular