రిస్క్ చేస్తున్న శ్రీ‌విష్ణు..డేట్ కూడా అనౌన్స్ చేసేశాడుగా!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లుగా న‌టించారు. పూర్తి కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు.

RAJA RAJA CHORA First look motion teaser | Sree Vishnu | Abhishek pictures|  - YouTube

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పోస్టర్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన థియేట‌ర్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. `కింగ్ సైజ్ ఎంటెర్టైమెంట్ గ్యారెంటీ` అని పోస్టర్‌ను కూడా వదిలారు.

Raja Raja Chora release on August 19 - Great Telangaana

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు విడుదల చేయడానికి స్టార్ హీరోలు సైతం వెన‌క‌డుగు వేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో శ్రీ‌విష్ణు రిస్క్ చేసి.. థియేట‌ర్‌లోకి దిగ‌బోతున్నాడు. మ‌రి ఈ యంగ్ హీరో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాలి.

Share post:

Popular