గుణ 369 గురించి తెలియని విషయాలు..

ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమలరెడ్డి కలిసి నిర్మించారు. ఇక ఈ సినిమా కథ వెనుక కొంత తంతు జరిగిందట. అయితే ఈ సినిమా వెనుక జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

అమ్మాయిలపై చేసేటువంటి దాడులపై తీసినటువంటి సినిమా ఇది. చివరిగా క్లైమాక్స్ లో రంగస్థలం మహేష్ పాత్ర అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఒకప్పటి ఎన్నో సినిమాలను గుర్తు చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. ఇక ఆ పాత్రలో మహేష్ తప్ప ఎవ్వరూ చేయలేనంత వీలుగా చేశాడు మహేష్.

ఇది చిత్రం చివరిలో హీరో కార్తికేయకి, కమెడియన్ మహేష్ కి మధ్య ఒక ఫైట్ పెట్టాలని ఆ దర్శకులు నిర్ణయించుకున్నారట. ఆ విషయాన్ని మహేష్ కు చెప్పగా.. మూడు మాసాలు ఈ సినిమా నీకోసం ఆపుతాను.. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తావా అని దర్శకుడు అడగగా.. అందుకు మహేష్ అది వర్కౌట్ అవ్వదు.. సార్ అని సున్నితంగా చెప్పి తప్పించుకున్నాడు.

అయితే మహేష్ మటుకు ఆ సినిమాలో తనకు అంత ప్రాముఖ్యత ఇచ్చినందువలన తనకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రంగస్థలం మహేష్. ప్రస్తుతం ఈయన పాగల్ సినిమాలో తన స్నేహితుడు అయినటువంటి డైరెక్టర్ తో కలిసి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా మహేష్..కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Popular