ఎమోషనల్ అయిన హీరో సుహాస్..?

టాలీవుడ్ లో సుహాస్ పేరంటే తెలియకపోవచ్చు. కానీ కలర్ ఫోటో సినిమా హీరో అంటే టక్కున గుర్తు పడతారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియా ముందు కొన్ని విషయాలను తెలియజేశాడు. సుహాస్ హీరోగా, సైడ్ యాక్టర్ పాత్రలో ఎన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఆయన మీడియా ముందు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం.

కలర్ ఫోటో సినిమా తో బాగా పాపులర్ అయిన సుహాస్ అతని చేతిలో దాదాపుగా ప్రస్తుతం ఆరు సినిమాల వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈయన మొదటి షార్ట్ ఫిలిం లో నుంచి నటించికుంటూ వచ్చి వెండితెర వైపు ప్రయాణం చేయడం వెనుక చాలా ఎమోషనల్ కథ సాగిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి నుంచి తన జర్నీ కూడా చాలా సాఫీగా జరిగిపోతోంది అంటూ తెలిపారు.

మొదట్లో చాలా ఇబ్బందులు పడినా, ఇప్పుడు చాలా సినిమాలతో బిజీగా ఉన్నానని తెలిపాడు. అంతేకాకుండా సుహాస్ కి సహాయం చేసిన అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చాడు. ఇతను హీరోగా, కమెడియన్ కూడా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈయన సినిమాల పరంగా ఎటువంటి క్యారెక్టర్ అయిన చేయడానికి సిద్ధమే అని తెలుపుకుంటూ వచ్చాడు.

అంతేకాకుండా కొన్ని సినిమాలలో సైకో లాంటి పాత్రలను కూడా త్వరలో అందించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ పాత్ర తనకు పేరు తెచ్చే విధంగా ఉంటే ఎలాంటి సినిమాకైనా ఒప్పుకుంటాను అని చెప్పుకుంటూ వచ్చాడు.

Share post:

Latest