ఎవరు మీలో కోటీశ్వరులు.. షోలో రాజమౌళి గురించి బయటపడ్డ విశేషాలు..?

దర్శక ధీరుడు రాజమౌళి అంటే మనందరికీ సుపరిచితమే.ఈయన డైరెక్షన్ లో సినిమాలు అంటే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ హీరో అయిన అతని డైరెక్షన్ లో సినిమా తీశారు అంటే కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఉంది. అందుచేతనే ఇతనితో సినిమాలు చేయడానికి అందరూ హీరోలు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా”ఎవరు మీలో కోటీశ్వరులు”షోని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి గురించి కొన్ని విషయాలు తెలియజేశారట, ఆ విషయాలను చూద్దాం.

రాజమౌళి ఏదైనా సీన్స్ తీసేటప్పుడు ఆ సీన్ పర్ఫెక్షన్ కోసం చాలా కష్ట పడతారని, ఆ సీన్ సరిగ్గా రాకపోతే ఎన్నిసార్లు అయినా తీయడానికి వెనుకాడని ఎన్టీఆర్ తెలిపారట. అందుచేతనే ఎన్టీఆర్ రాజమౌళిని జక్కన్న అనే పేరుతో పిలుస్తాడట. ఇక అదే పేరు అందరి నోట మారుమోగింది.ఏదైనా సీన్ సరిగ్గా రాకపోతే.. ఆ సీన్ను మరీ మరీ తీయడం వల్ల, ఇది మరీ అన్యాయం జక్కన్న, దీనిని పిచ్చి అంటారు. అంటూ సరదాగా విసుక్కునే వాడిని అని ఎన్టీఆర్ తెలిపాడు.

ఇక మరొక వైపు రామ్ చరణ్ కూడా రాజమౌళితో మగధీరసినిమా తీసిన విషయం అందరికీ తెలిసిందే అయితే రామ్ చరణ్ రాజమౌళి గురించి ఏం చెప్పాడంటే..”నాలాంటి స్లో పర్సన్స్ కు.. రాజమౌళి లాంటి వ్యక్తి కరెక్ట్ అని చెప్పుకొచ్చాడు”. ఇక రాజమౌళి తనకు గుర్తుండిపోయే ఎటువంటి పాత్రలను ఇచ్చినందుకు ఆయనకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇక వీరిద్దరూ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని మనం కోరుకుందాం.

Share post:

Latest