కార్తీకదీపం జ్యోతి రెడ్డి భర్త ఎవరో తెలుసా?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఏసీపీ పాత్రలో నటిస్తున్న నటి జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సీరియల్స్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.నటి జ్యోతిరెడ్డి 1983 ఆగస్టు 4న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి బి ఎస్ ఎన్ ఎల్ లో పనిచేస్తారు.ఈమెకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పెళ్లి అయ్యింది. ఈమె ప్రస్తుతం భాగ్యనగరంలో ఉంటోంది.ఈ దంపతులకు యస్వంత్,అభిరామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి మలేషియాలో హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు. చిన్నబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు.

అయితే జ్యోతిరెడ్డికి చిన్నప్పటి నుంచి డాన్స్,యాక్టింగ్ మీద మక్కువ ఉండడంతో ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. తల్లి సపోర్ట్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె బుల్లితెర పైకి వచ్చి 30ఏళ్ళు అవుతోంది. తనకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండడం వలన ఇండస్ట్రీలో ఉన్నాననీ జ్యోతి తెలిపింది.తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించిన జ్యోతిరెడ్డి 2వేలకు పైగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈమె రక్తసంబంధం, ప్రేమ ఎంత మధురం వంటి ఎన్నో సిరియల్స్ లో నటించింది.

Share post:

Popular