రజినీకాంత్ పాటలో డేవిడ్ వార్నర్..!

ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతంపై రోబో సినిమాలోని కిలిమంజారో పాట షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో ఐశ్వర్యారాయ్ రజినీకాంత్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసారు. అయితే ఆ పాటకు ఇప్పుడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులేశారు. అంతేకాదు, ఐశ్వర్యారాయ్ తో కలిసి రజినీకాంత్ స్టైల్‌లో డాన్స్ చేశారు.

అయితే ఇదంతా నిజం కాదండోయ్.. రీ-ఫేస్ యాప్ ఉపయోగించి కిలిమంజారో పాటలో రజనీకాంత్ ముఖచిత్రం తీసేసి.. డేవిడ్ ఫొటోని ఎడిట్ చేశారు. ఆ వీడియోని డేవిడ్ వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దాంతో డేవిడ్ వార్నర్ రజినీకాంత్ స్టైల్‌లో ఐశ్వర్యారాయ్ తో కలిసి స్టెప్పులేసినట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకి దాదాపు ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

Share post:

Popular