లేడీ సింగర్ తో సింగర్ మను కష్టాలు.. ఏం జరిగిందంటే?

మనో నటుడిగా, సింగర్ గా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అదే తన స్వరంతో ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సింగర్ లలో కూడా నటులు ఉంటారు అంటున్నారు మనో. అలా గాయకుడికీ నటుడిగా అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకుంటాడు అంటున్నాడు సింగర్ మనో. ఈ సత్తిబాబు దర్శకత్వం వహించిన క్రేజీ అంకుల్స్ సినిమాలో యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 19 వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ ఓ ఆడది ఓ మగాడు సినిమా దాసరి నారాయణగారు నన్ను బాలనటుడిగా పరిచయం చేశారు అని చెప్పుకొచ్చారు.

30

అలాగే రంగూన్ రౌడీ, నీడ, కేటుగాడు ఇలాంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని చెప్పుకొచ్చాడు. ఇక క్రేజీ అంకుల్స్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బంగారు షాపు యజమాని పాత్ర లో మనో నటిస్తున్నాడు. తమ భార్యలు తమను సరిగా పట్టించుకోవడం లేదని ముగ్గురు స్నేహితులు భావిస్తారు. ఆ సమయంలోనే ఒక లేడీ సింగర్ తో పరిచయం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? సమస్యల నుంచి ఎలా బయట పడతారు? అనేదే ఈ సినిమా కథ. సింగర్ మనో కి కామెడీ పాత్రలు అంటే ఎక్కువ ఇష్టం. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వీరిలా కామెడీ ప్రధానంగా ఉండే పాత్రలు చేయాలి అనుకుంటున్నాను, ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అంటూ సింగర్ మనో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest