జగన్ 16వ స్థానానికి పడిపోవడానికి 6 కారణాలివే..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టాప్ ప్లేస్ లో ఉండేవారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఆయన టాప్ ర్యాంక్ 16వ ర్యాంకుకి పడిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ పరిపాలనపై 81% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోవడానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. మూడు రాజధానులు

జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ అతని నిర్ణయం ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. మూడు రాజధానుల వ్యవహారంలో ఎటువంటి పురోగతి కూడా కనిపించడం లేదు. దాంతో చాలామంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2. లిక్కర్ పాలసీ:

జగన్ అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ వల్ల మందుబాబులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇష్టానుసారం లిక్కర్ ధరలు పెంచడంతో జగన్ పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం పాలసీ వల్ల జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పొచ్చు.

3. ఇసుక కుంభకోణం:

రాష్ట్రంలో ఇసుక కుంభకోణాలకు సొంత పార్టీ వారే పాల్పడుతుండటంతో జగన్ పై వ్యతిరేకత వస్తోంది. కుంభకోణాలకు పాల్పడేవారిపై కదం తొక్కి కఠిన చర్యలు తీసుకోకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు.

4. ప్రతిపక్ష నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం:

టీడీపీ నేత నారా లోకేష్ దుర్ఘటన జరిగిన ప్రతిసారి స్పందిస్తున్నారు. నిరసనలు, ఆందోళనలు చేయడంలో ఆయన ముందు ఉంటున్నారు. అధికార పార్టీ తన పని తాను చేసుకోకుండా లోకేష్ ని అరెస్టు చేసి అవసరంగా అతడికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికే నష్టం జరుగుతుందనేది గమనించలేకపోతున్నారు.

5. సినిమా టికెట్ ధరలు:

టికెట్ల ధరలు నిర్దేశించినట్లు తక్కువ ధరకే అమ్మాలని జీవో జారీ చేశారు కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదని తెలుస్తోంది. ఈ జీవో వల్ల ప్రభుత్వం, సామాన్య ప్రజలు నష్టపోవడం తప్ప ఒరిగేదేమీ లేదు.

6. ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి:

ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ కన్నెర్ర చేస్తున్నారు. మంచి మాటల చెప్పి ప్రభుత్వ ఉద్యోగులతో తమకు అనుగుణంగా పని చేయించుకోవాలి. కానీ జగన్ రివ్యూ మీటింగ్స్ లో ఉద్యోగులను మందలిస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించి ఓటమిపాలయ్యారు.

పైన పేర్కొన్న కారణాల వల్లే జగన్ పై వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది కానీ ఇప్పటికైనా జగన్ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమ సీఎంగా వెలుగొందే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ అవి ప్రజల వ్యతిరేఖతను నిలువరించలేవు.

Share post:

Latest