సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

చిత్రసీమలో మరొక సినీ విషాదం. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపం శ్యామ్ అనారోగ్య సమస్య కారణంగా మృతి చెందారు. అయితే ఈయన ముఖ్యంగా హిందీ లో ప్రసారమయ్యే “మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ” లో ఈయన చేసిన నటన మర్చిపోలేము. ఈయన వయసు 63 సంవత్సరాలు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా, ఇదే క్రమంలో శనివారం అవయవాలు వైఫల్యం చెందడం తో మరణించాడు.

ఆయన మరణించినట్లు ఆయన స్నేహితుడు యశ్పాల్ నటుడు పాల్ శర్మ తెలియజేశారు. ఈయన నాలుగు రోజుల క్రితమే తీవ్ర అస్తవ్యస్తకు లోనవడం లైఫ్ స్టైల్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు తెలియజేశారు. డాక్టర్లు ఆయనకు చికిత్స చేస్తున్న సమయంలో అవయవాలు స్పందించకపోవడంతో ఆదివారం రాత్రివేళ కన్నుమూసినట్లు తెలుస్తోంది.

ఈయన మృతి పట్ల బాలీవుడ్ స్టార్ లు సంతాపం తెలియజేసినట్లు సమాచారం. ఈయన సీరియల్స్ తో పాటు, కొన్ని సినిమాలలో కూడా నటించాడు. ఈ రోజున ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈయన తెలుగులో కూడా మంచి నటుడిగా పేరు పొందాడు. రక్త చరిత్ర సినిమాలలో బాగా నటించాడు.

టాలీవుడ్ లో కూడా ఈయనకి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఇక ఈయన ఒక ప్రముఖ వెబ్ సిరీస్ లోని రెండవ సిరీస్ షూటింగ్ జరుగుతూ ఉండగా పోయిన సంవత్సరం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అప్పుడు ఆయనకి చికిత్స అందించడంతో.. బ్రతికారని తెలిపారు. కానీ మరొకసారి కిడ్నీ సంబంధిత వ్యాధితో హాస్పటల్ లో చేరిన ఆయన మల్టిపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో కన్నుమూసినట్లు తెలుస్తున్నది.

ఏది ఏమైనా ఒక దిగ్గజ నటుడిని మనం పోగొట్టుకున్నాం అని చెప్పుకోవచ్చు

Share post:

Latest