చిరు మరో డైరెక్టర్ కు అవకాశం ఇవ్వనున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే చాలు, తమ ఫ్యాన్స్ కి ఎంతో పండుగ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటం విశేషంగా మారింది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత, లూసిఫర్ వంటి భారీ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లతో మరి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలియజేశారు ఆ డైరెక్టర్లు.

ఇదే తరుణంలోనే మరి కొత్త డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తారా..? లేదా..? అనే సందేహం కలుగుతున్నది.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు ప్రభుదేవా. ఈయన ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు తీస్తుంటాడు. ఇతను ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ సినిమా చేస్తేనే హిట్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక తాజాగా టాలీవుడ్ వైపు అడుగు పెట్టాలని చూస్తున్నాడు ప్రభుదేవా.

ఇదే తరుణంలో 2008లో శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాని తెరకెక్కించాడు. కానీ అది సరిగ్గా ఆడకపోయినా ప్రభుదేవాకు, చిరంజీవ కు మధ్య బాగా బంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుదేవా ఏదైనా సినిమాలను రీమేక్ లో బాగా తీయగలడనే ఉద్దేశంతోనే.. చిరంజీవి ప్రభుదేవాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో వీరిద్దరూ సినిమా చేస్తారనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఎటువంటి సినిమాను రీమేక్ చేస్తారనే విషయం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం చిరంజీవి అయితే అన్ని రీమేక్ సినిమాలను చేస్తుండడం విశేషం. అయితే మరి ఎటువంటి సినిమాను ఒప్పుకుంటాడో వేచిచూడాల్సిందే.

Share post:

Latest