చిరు.. దర్శకుడు చేత తిట్లు తిని మౌనంగా ఉండడానికి గల కారణం..

మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు.ఆ తర్వాత అల్లు రామలింగయ్య అల్లుడు గా మారి, కొంతవరకు సినీ ఇండస్ట్రీలో సపోర్టు దక్కించుకుని, ఆ తరువాత స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగాడు. ఆయన కేవలం తన స్వార్థం చూసుకోకుండా సినీ కార్మికుల కోసం కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీకి ,తన వంతు సహాయం చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మహానేత.ఒకానొక సందర్భంలో ఒక దర్శకుడి చేత ఎన్ని చివాట్లు పడినా మౌనంగా ఉన్నారట. అందుకు గల కారణాలు ఏమిటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

భారతీరాజా.. దిగ్గజ డైరెక్టర్.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరమీద చూపించాడు. .డైరెక్టర్ గా ప్రతిభను చూపే వ్యక్తీ, వ్యక్తిగతంగా ఆలోచిస్తే, ప్రతి చిన్న మాటలకు ఆయనకు బాగా విపరీతమైన కోపం వస్తుంది. ఏ పని అయినా సరే అసలు చేయకపోయినా, పట్టించుకోకపోయినా ఆర్టిస్టులపై ఎక్కువ కోపంతో విరుచుకుపడేవాడు. ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఈయన కోపం స్థాయి మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఇకపోతే హీరో , హీరోయిన్లు సీన్లు సరిగ్గా చేయకపోయినా, సినిమా యూనిట్ సభ్యులు సరిగ్గా పని చేయకపోయినా ,విపరీతమైన కోపం ప్రదర్శించేవాడు. అందుకే ఆర్టిస్టులు, టెక్నికల్ టీం ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండేవారు.Bharathiraja should dissolve the new Producers council, demands Kalaipuli  Thanu and several producers | Tamil Movie News - Times of India

ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కోపాన్ని తగ్గించుకోవాలని ఆయన ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.ఆరాధన సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో పని ఒత్తిడి అధికంగా ఉండటం వలన భారతీరాజాకు చాలా కోపం చిరాకు వస్తు ఉండేది. ఇక ఆ సినిమాలో నటించిన హీరో మెగాస్టార్ పైన తన కోపం చూపించాడట. ఆ సినిమాకు నిర్మాతగా అల్లు అరవింద్ ఉన్నాడు. అకారణంగా తన మీద కోపం చూపించడాన్ని, చిరు తప్పు పట్టవచ్చు.. కానీ ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయాడట చిరంజీవి.

ఇక భారతీరాజా , చిరంజీవిపై తను కోపాన్ని ఎక్కువగా చూపించినప్పటికీ , ఆయన ఏమీ అనకపోవడం తో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచన ఉన్నంతగా ఉంటుందని చెప్పారు భారతీరాజా..చిరంజీవికి గౌరవం, సంస్కారం ,సభ్యత చాలా ఎక్కువ అని కూడా చెప్పారు. ఆ కారణంగానే తను ఉన్నతస్థాయిలో చేరుకున్నాడు.. అందుకే చిరంజీవి అంటే సినిమా పరిశ్రమలో అందరూ ఇష్టపడటానికి కారణం ఇదే అని కూడా మనకు అర్థం అవుతోంది.