సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు..కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న వ్యక్తి.. ఇక ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కూడా చిరంజీవికి బాగా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో వీరిరువురు ఎక్కువగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే , మెగాస్టార్ చిరంజీవి ని జగన్మోహన్ రెడ్డి కలవాలి అనుకుంటున్నారట. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.

ఏపీ మంత్రి పేర్ని నాని సహాయంతో ఈ నెల చివరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో చిరంజీవి ఫ్యామిలీ మొత్తం సీఎం జగన్ దంపతులను సత్కరించారు. ఆ తర్వాత ఇరువురు పుట్టిన రోజులకు సహా పలు సందర్భాలలో సోషల్ మీడియా వేదికలో విషెస్ తెలుపుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి కూడా తన ట్విట్టర్ లో ప్రశంసిస్తూ ఉంటారు.

గతేడాది చిరంజీవి,నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, వంటి ఇతర టాలీవుడ్ ప్రముఖులు అంతా కలిసి సీఎం జగన్ ను కలిశారు. సినీ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు గురించి చర్చించారు అన్నట్లు వినిపిస్తోంది. అప్పట్లో వైసీపీ నేత పేర్ని నాని ని, ప్రముఖ సినీ నిర్మాత అయిన పొట్లూరి వరప్రసాద్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇక థియేటర్ ల సమస్య గురించి టికెట్ల రేట్లు గురించి సినీ కార్మికుల బతుకు తెరువు గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది ఈ మీటింగ్లో. అలాగే టికెట్ల రేటు పెంపు విషయంలో పాటు, తదితర విషయాలపై మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం రోజున ఫోన్ చేసి మీ పెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సమస్య వివరాలు వివరించాల్సిందిగా చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి తరఫున ఆహ్వానించారు.