బుల్లితెరపై-వెండితెరపై.. బెస్ట్ జోడిగా.. వీరికి సొంతం..?

సినీ ఇండస్ట్రీ లో ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ జోడీలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా కొన్ని జోడీలు ఆన్ స్క్రీన్ మీద ఎంతయితే పర్ఫార్మెన్స్ చేశాయి స్క్రీన్ మీద కూడా నిజజీవితంలో దంపతులుగా మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వారిలో చెప్పుకోగలిగిన జోడి సమంత, నాగచైతన్య.
వీరిద్దరి జంట చూడటానికి కనులకు ఇంపుగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇద్దరు కలిసి సినిమాలో నటించడం, ఆ తర్వాత ప్రేమించుకోడం, పెళ్లి చేసుకోవడం జరిగింది.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బుల్లితెర నటులు కూడా ఇలాగే అవ్వాలనుకుంటున్నారు. వారే బుల్లితెర బెస్ట్ జోడి గా గుర్తింపు పొందిన రష్మీ – సుధీర్ .ఇక వీరిద్దరూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే కొన్నిసార్లు చైతు – సమంతల ని ఆదర్శంగా తీసుకుంటారు. కొన్నిసార్లు వారే మాకు స్ఫూర్తినిచ్చారు అంటుంటారు.

ఈ మధ్యకాలంలో రష్మీ – సుధీర్ కలిసి సినిమాలో నటిస్తున్నారట. ఇద్దరూ హీరో,హీరోయిన్లుగా బాగా సెట్ అవుతామని తెలిపారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని సుధీర్ ఇటీవల టీవీ షోలో తెలిపారు.

తాజాగా సుధీర్, రష్మి కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పెడుతూ ఇలా అన్నాడు. నాగచైతన్య – సమంతల ఫోటోలను కూడా పెట్టి, మేం కూడా మంచి జోడీ అవుతామని చెప్పారు. దీనికి ఫాలోయింగ్ బాగానే వచ్చింది.

తెర ముందు కానీ తెర వెనకాల కానీ వీరు మంచి కపుల్స్ గా ఉంటారని స్నేహితులు నెటిజన్లు మంచి బిరుదునిచ్చారు. అయితే సమంతా – నాగచైతన్యలా వీరిద్దరూ కూడా సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటా రేమో చూడాలి మరి.