భావోద్వేగం ప్రదర్శించడం అంటే చాలా ఇష్టం అంటున్న హీరోయిన్..

ఇటీవల ఒక యంగ్ హీరోయిన్ సినిమాలలో భావోద్వేగం ప్రదర్శించడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఎలాంటి సిచువేషన్ లో ఉండే ఏ రకం సినిమానైనా నేను చేస్తాను అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈమె రీసెంట్ గా కనబడుట లేదు అనే సినిమాను తీయడం జరిగింది. ఈమె ఎవరో కాదు వైశాలి రాజ్..ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం కనబడుట లేదు.. సునీల్ , సుక్రాంత్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది. ఈ మూవీలో వీరిద్దరూ ముఖ్యం పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు డైరెక్టర్ బాలరాజు ఎం దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైశాలి రాజ్ కొన్ని విషయాలను విలేకరుల ముందు వెల్లడించారు.

ఈమెకి భావోద్వేగాల వుండే క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టమట. తనకు గ్లిజరిన్ లేకపోయినా సరే ఏడ్చే సన్నివేశాలని సులభంగా చేస్తుందట. కొన్ని లఘు చిత్రాలలోనూ , ధారావాహికల్లో నటించడం వలన తనకు ఎంతో అనుభవం వచ్చింది. మధ్యతరగతి అమ్మాయిగా కనిపించే నా పాత్ర చుట్టూ జరిగే కథ ఇది.

అంతేకాకుండా ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా ఉంటుంది. ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్ గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా సునీల్ గారు సీనియర్ నటుడు కదా..! అనుకున్నాను. కానీ ఆయన చాలా బాగా కలిసి పోతాడు. తొలి షూటింగ్ రోజే ఆయనతో అందరం బాగా కలిసిపోయాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల గుండెల్లో మిగిలి పోతుంది అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.