చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్.. ఏమిటంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే కమెడియన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన వ్యక్తి బండ్ల గణేష్. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి పై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించాడు బండ్లగణేష్. పొగడ్తలతో చిరంజీవికి ఆకాశానికెత్తేశారు.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను పిల్లల పాఠశాల పుస్తకాల్లో పాఠంగా చేర్చాలనే ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ ఇంటరాక్షన్ సెషన్ లో తన డిమాండ్ ను రిక్వెస్ట్ గా వెల్లడించారు. అంతకుముందు వఖిల్ సాబ్ మూవీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ తో వైరల్ అయిన బండ్ల గణేష్ మరొకసారి చిరంజీవి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇకపోతే బండ్ల గణేష్ సినీ విషయానికి వస్తే ఇంతవరకు కమెడియన్గా నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ హీరోగా అవతారం ఎత్తపోతున్నాడు.