సూపర్ హిట్ కొట్టిన రీమేక్ సినిమాలో బండ్లగణేష్!

బండ్ల గణేష్ తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కామెడీయన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా సెటిల్ అయిపోయారు. ఇక ఈయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా బండ్ల గణేష్ మరి హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

తమిళంలో ఆర్ పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఒత్త సెరప్పు సైజ్ 7 ఈ సినిమాను రీమేక్ లో బండ్లగణేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వెంకట చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే స్వాతి చంద్ర నిర్మించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అయితే బండ్ల గణేష్ హీరో పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు. జాతీయ అవార్డులు సాధించిన ఒత్త సెరుప్పు సైజ్‌ 7 కు ఇది తెలుగు రీమేక్‌.