ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కారణంగా ఆగిపోయిన నటి నిశ్చితార్థం?

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ తాలిబన్ల వల్ల అంతర్జాతీయంగా వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కూడా పోయాయి. ఇది ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల కారణంగా ఒకనాటి నిశ్చితార్థం కూడా రద్దయింది అంటున్నారు బిగ్బాస్ సీజన్ కంటెస్టెంట్ అర్షి ఖాన్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్ మరొకసారి ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది .

ఈ ఏడాది అక్టోబర్ లో ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ తో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా తాలిబన్ల కారణంగా ఆ నిశ్చితార్ధం రద్దయిందని తెలిపారు. అలాగే అర్షి ఖాన్ ఒక ఆంగ్ల మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ తో ఈ ఏడాది అక్టోబర్ లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే కానీ తాలిబన్లు కారణంగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాము అని తెలిపారు. ఆ క్రికెటర్ మా నాన్న స్నేహితుడు కుమారుడు అని తెలిపింది. అయితే నిశ్చితార్దం ఆగిపోయిన మీరు మంచి స్నేహితులు గానే ఉన్నాం, ఈ నిర్ణయం పట్ల ఎంత సంతోషంగా ఉన్నాం, అలాగే నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తి అయి ఉంటాడు అని అర్షి ఖాన్ తెలిపింది.

Share post:

Popular