పూరి జగన్నాథ్ విడుదల చేసిన అప్పుడు – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన సినిమా అప్పుడు-ఇప్పుడు . ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సుజన్, తనిష్క్ కలిసి నటిస్తున్నారు. చలపతి పువ్వుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో శివాజీ రాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు విజయ రామకృష్ణంరాజు, ఉషారాణి కనుమూరి మాట్లాడుతూ వెరీ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ఇది అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి అంటూ తెలిపారు.

అయితే ఇటీవల దర్శకుడు కే రాఘవేంద్ర రావు చేతులమీదుగా విడుదల అయిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు అని తెలిపారు. దర్శకుడు చలపతి పువ్వుల మాట్లాడుతూ అప్పుడు- ఇప్పుడు సినిమా టీజర్, థాంక్స్ మంచి పాపులర్ అయ్యాయి. ఇందులో హీరో హీరోయిన్లు కొత్త వారు అయినప్పటికీ చాలా చక్కగా నటించారు అంటూ తెలిపారు. కళ్యాణ్ సమి విజువల్స్, అలాగే పద్మనాబ్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ అని తెలిపారు.

Share post:

Latest