అమెజాన్ ప్రైమ్‌ న్యూ ఫీచర్ మీ కోసం..!

తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ సేవా సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ యూజర్లకు సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అమెజాన్ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల పాత్రాల ఇమేజ్‌ను డిస్‌ప్లే పిక్చర్ గా పెట్టుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రైమ్ వీడియో సపోర్ట్ చేసే అన్ని సిస్టమ్‌లలో పాత్రాల ఇమేజ్‌ను డిస్‌ప్లే పిక్చర్లుగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వినియోగించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ లలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ల పిక్స్ నుంచి మీకు నచ్చిన క్యారెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్, ఐఓస్ పరికరాలు, ఫైర్ టాబ్లెట్‌ల యూజర్లు వీడియో యాప్ కింద భాగంలో మై స్టఫ్‌పై క్లిక్ చేసి.. డ్రాప్‌-డౌన్ మెనూలో ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేయాలి. తరువాత ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అమెజాన్ ఒరిజినల్ రోల్ ని డిస్‌ప్లే ఇమేజ్‌గా ఎంచుకోవచ్చు.

Share post:

Latest