అమెజాన్ ఉద్యోగులకు భారీ ఆఫర్‌..!

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా టీకా తీసుకున్న ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో భారీ బహుమతులను అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతున్నాయి. వందలాది ప్రజలు డెల్ట్‌ వేరియంట్‌ బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అమెరికాలో ‘మాస్క్ ఫ్రీ’ అని ప్రభుత్వం ప్రకటించడమేనని కేసులు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కూడా అప్రమత్తమైంది. హెడ్‌క్వార్టర్స్‌లోని టీకా తీసుకోని 9 మంది మాస్క్‌ లేకుండా తిరగడం వల్ల.. వారి నుంచి సహోద్యోగులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన అమెజాన్‌ ఓ ‌ఆఫర్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది.

- Advertisement -

‘మ్యాక్స్‌ యువర్‌ వ్యాక్స్‌’ పేరిట వ్యాక్సిన్‌ తీసుకున్న ఉద్యోగులకు గిఫ్ట్స్ ఇస్తామని ప్రకటించినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ మేరకు రూ.14.9కోట్లను అమెజాన్ ఖర్చు చేయనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తారు. అనంతరం డ్రాలో విన్నర్ గా నిలిచిన తొలి ఇద్దరికి రూ.3.7కోట్లను బహుమతిగా ఇస్తారు. వీరి తర్వాత విజేతలుగా నిలిచిన ఆరుగురికి రూ. 74లక్షలు అందజేస్తారు. ఇక వీరి తర్వాత విన్నర్స్ అయిన ఐదుగురు ఉద్యోగులకు కార్లు, వెకేషన్ ప్యాకేజీలను ఫ్రీగా అందించనుందని తెలుస్తోంది.

Share post:

Popular