ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో బన్నీ ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేకపోయింది. దీంతో ఈ సినిమా ఉందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. అంతేగాక ఈ సినిమాలో బన్నీ కోసం హీరోయిన్‌ను వెతకడం కూడా స్టార్ట్ చేశారట చిత్ర యూనిట్.

ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను టాలీవుడ్‌లో పరిచయం చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ కోసం ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేయాలని దర్శకుడు వేణు శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అమ్మడి పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చిత్ర వర్గాల టాక్. మరి ఐకాన్ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

Share post:

Popular