త్రిష ప్రత్యేక పూజలు.. ఎందుకు చేస్తుందంటే?

త్రిష ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సౌత్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. ఈమె తెలుగు, తమిళం, మళయాళం,ఇలా అన్ని భాషలలో అద్భుతంగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే ఇది ఇలా ఉంటే తాజాగా త్రిష ఒక మధ్య ప్రదేశ్ లోని ఒక గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అయితే త్రిష గుడిలో పూజలు చేస్తున్నది తన కోసం కాదు. పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం త్రిష పూజలు చేస్తోందట.మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఓర్చా లొకేషన్స్ లో జరుగుతోంది. అక్కడ త్రిష అలాగే కార్తీ, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకోసం త్రిష గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారట. ఈ సినిమా మధ్య ప్రదేశ్ లోని వివిధ లొకేషన్స్ లో ఈ నెల ఆఖరి వరకూ షూటింగ్ జరుగుతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest