ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..

ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశారు ఈ చిత్రం మేకర్స్.

ఇకపోతే ఈ సినిమాలో రాంచరణ్ సిద్ధా గా కళాశాల టీం లీడర్ గా ఉంటారని చూపించారు. నక్సలైట్ లుక్ తో ఈ సినిమా అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించినప్పుడు చిరంజీవి నిర్ణయాన్ని కూడా అడిగారట. ఆయన కాస్త వారి ఇంటిలో వారి ఒపీనియన్ తీసుకోవడం గమనార్హం. ఇక అందులో భాగంగానే చిరంజీవి తల్లి అంజనాదేవికి ఈ చిత్రం టైటిల్ బాగా నచ్చడంతో తను కూడా ఒప్పుకుందట. ఇకపోతే చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.

ఆచార్య మూవీ కంటే ముందే ఆర్ఆర్ఆర్ చిత్రం మూవీ రిలీజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నట్లు సమాచారం. ఇక ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడడంతో వీరికి కొంచెం షాక్ గానే అనిపిస్తోంది అయితే ఆచార్య సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, అక్టోబర్ లో విడుదల చేస్తామని తెలిపారు

Share post:

Latest