పుష్పరాజ్ నయా రికార్డు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మందన్నా నటిస్తుంది. నక్సలైట్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకేక్కస్తున్నారు.ఈ చిత్రం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ క్రమంలో మొదటి పార్ట్ “పుష్ప ది రైజ్” నుంచి ఓక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా విడుదలయిన కొద్ది సేపటికే ఈ పాట అన్ని భాషల్లో కూడా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. రిలీజ్ అయినా 24 గంటల్లోనే 9.4 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మాములు విషయం కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి లిరికల్ పాటతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు అనడానికి ఈ పాటే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. !

Share post:

Popular