ఆక‌ట్టుకుంటున్న ఆది `బ్లాక్` టీజ‌ర్‌!

నటుడు సాయికుమారు తనయుడు, యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం `బ్లాక్‌`. జి.బి కృష్ణ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్‌ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‏ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఆదికి జోడీగా దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా బ్లాక్ ఉండ‌బోతోంద‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఆధ్యంతం ఆక‌ట్టుకున్న ఈ టీజ‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

క‌రెక్ట్‌గా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించి.. సినిమాను వ‌దిలితే ఖ‌చ్చితంగా ఆది హిట్ కొడ‌తార‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రామ‌ప‌డుతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలావరకు లాక్‏డౌన్ కంటే ముందే పూర్తైంది. ఈ సినిమాకు సురేషన్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

 

Share post:

Popular