ఆ నటికి కరోనా సోకిందట..

కరోనా ప్రస్తుతం తగ్గిందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరం సంతోషంగా ఉంటాం. అయితే ఇక ప్రస్తుతం సినిమా థియేటర్ లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో జనం ఎక్కువగా థియేటర్ లో సినిమాలు చూసేందుకు పరుగులు తీస్తున్నారు. ఇక అయితే ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే , కరోనా కేసులు ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ప్రజలు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు బెంబేలెత్తుతున్నారు. కరోనా పీడ విరగడయింది అనుకుంటే.. థర్డ్ వేవ్ రూపంలో మరి వస్తుంటే అందరికీ భయం వస్తున్నది. అయితే ఇప్పుడు ఒక స్టార్ నటి కి కరోనా బయటపడడం వల్ల చాలా సతమతమవుతున్న దట. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోలతో నటించిన”నదియా”. ఇక ఈమె ఎంతో మంది స్టార్ హీరోలతో, హీరోయిన్లతో కలిసి నటించింది.

ఇక ఈమె తన వయసు ఎక్కువగా ఉండడం చేత కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లు, తమ దగ్గర ఉంటే సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈమె కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ కూడా వేయించుకున్నది. అయినా కూడా కరోనా భారిన పడింది ఈ నటి. అయితే ఆమె అభిమానులు మాత్రం తొందరగా కోలుకొని మళ్ళీ తిరిగి సినిమాల్లో షూటింగ్స్ జరుపుకోవాలని అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

ఇక ప్రస్తుతానికి ఈమె వరుణ్ తేజ్ తో గనీ, వరుడు కావలెను, వెంకటేష్ తో కలిసి దృశ్యం 2 వంటి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నది. అయితే ఈమెకు కరోనా సోకడం వల్ల ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ నిలిపి వేయడం జరిగింది. ఏదిఏమైనా కరోనా బారి నుండి బయటపడాలంటూ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే