20 ఏళ్ల అమ్మాయిగా మారిన ఓల్డ్ హీరోయిన్ ..!

పెద్ద స్టార్ హీరోలతో నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం 50ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారిందో తెలుసుకోవాల్సిందే. ఆ అమ్మడు ఎవరో కాదు ఖుష్బూ ..ఈమె సినీ దర్శకుడు సుందర్ ని పెళ్లిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వీరికి ఇద్దరు అమ్మాయిలు అవంతిక, నందిత ఉన్నారు. ఈమె సినిమాల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా సీనియర్ నటి గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మెగాస్టార్ స్టాలిన్ సినిమాలో ముఖ్యపాత్ర వహించింది.
విక్టరీ వెంకటేష్ తో, నాగార్జునతో ఇలా పెద్ద పెద్ద హీరోలతో గొప్పగా నటించింది.

అంతేకాకుండా ఈమె రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. అందువలన సినీ ఇండస్ట్రీకి కొద్దికాలం బ్రేక్ ఇచ్చింది.ప్రస్తుతం భాజపా నాయకత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రంగుల ప్రపంచంలోకి అడుగు పెడుతోందని తెలుస్తోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తోంది.Actress Kushboo New Look

గత కాలంలో కుష్బూ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కుష్బూ లుక్ అమాంతంగా మారిపోయింది. ఈ ఫోటోస్ చూస్తే ఆమె 50 నుంచి 20 ఏళ్లకు మారిపోయారా అనుకుంటారు.ఇక అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇంత తొందరగా అంత స్లిమ్ ఎలా అయ్యారు. అంటూ ఆరాలు తీస్తున్నారు.

ఇటీవల ఖుష్బూ సైజ్ జీరో కావటానికి చాలా వ్యాయామాలు చేస్తున్నారట. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. సహజసిద్ధంగా చేసిన ప్రయత్నం కొంతవరకు అక్కరకు వచ్చింది.
ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూసి అవాక్కయిన యూత్.. కుష్బూ 21 ఎఫ్ అంటూ పొగిడేస్తున్నారు. నిజంగానే కుమారి 21ఎఫ్ లాగా మారిపోయి, యూత్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇలా మారిన రూపాన్ని బట్టి ఇకపై నటించేందుకు ఖుష్బూ కొంచెం కొత్త పాత్రలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అక్క ,చెల్లి లేదా వదినమ్మ పాత్రలకు ఫిట్ గా ఉంటారని తెలుస్తోంది.

Share post:

Popular