సీఎం దత్తత గ్రామాల్లో జరిగింది నిల్ అని నిలదీస్తున్న టీపీసీసీ చీఫ్..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హల్ చల్ చేస్తున్నాడు. రెండు రోజుల పాటు అక్కడ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. మంగళవారం ప్రారంభించిన ఈ దీక్ష ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది. మొదటి రోజు గ్రామంలో పర్యటించి ఓ దళిత కుటుంబం ఇంట్లో నిద్రించిన రేవంత్ రెండోరోజు బుధవారం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాడు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుంటూ.. సీఎం చేసిన పనులను సమీక్షిస్తున్నారు. అంతేకాక నేరుగా జిల్లా కలెక్టరుకు ఫోన్ చేసి సీఎం దత్తత గ్రామంలో పలు సమస్యలున్నాయి.. వాటిని పరిష్కరించాలని వివరించారు.

ఈ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతోపాటు రేవంత్ పొలిటికల్ మైలేజే కూడా ఓ స్థాయికి వెళుతుందని రేవంత్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారట. అసలు రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లినే ఎందుకు ఎంచుకున్నారంటే.. ఆ గ్రామం సీఎం దత్తత గ్రామం కాబట్టి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత ఆ పల్లెలో సమస్యలు పరిష్కారం కాలేదని ప్రపంచానికి చెప్పడమే రేవంత్ ఉద్దేశం. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలోనే సమస్యలు ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి అని ప్రజలకు ఇన్ డైరెక్టుగా చెబుతున్నారు. ఏమేం అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పండి.. నేను ఇక్కడే ఉంటా.. మీరు చేశారని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా అని ఘాటుగా సవాల్ చేశారు. అయితే.. ఈ ప్రశ్నలకు టీఆర్ఎస్ అధినేత నుంచి కానీ, పార్టీ ప్రతినిధుల నుంచిగానీ మౌనమే సమాధానమైంది.