ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది.

పోలీసులు దర్యాప్తు చేయగా అందులో ఆర్యకు సంబంధమే లేదని తేల్చారు. చెన్నై పులియంతోప్‌కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళతో ఆర్యలా నటిస్తూ మోసం చేసినట్లు వెల్లడించారు. వాట్సప్ లో ఆ మహిళతో ఛాట్ చేసిన ఆధారాలను కూడా వారు సేకరించారు. ఈ సందర్భంగా చెన్నై పోలీసులకు హీరో ఆర్య కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా పోలీస్ కమిషనర్-సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చెన్నై సైబర్ క్రైమ్ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.

Share post:

Latest