సత్యదేవ్ నటన పై రానా ప్రశంసల వర్షం…ఎందుకంటే..?

టాలీవుడ్ లో సత్యదేవ్ హవా నడుస్తోంది. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సత్యదేవ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. మొదట్లో సైడ్ క్యారక్టర్స్ చేసుకుంటూ సాగిన ఆయన సినీ ప్రయాణం నేడు వైవిధ్యభరితమైన సినిమాలు చేసే హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా సత్యదేవ్ హబీబ్ అనే సాంగ్ ను చేశాడు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుపాటి రానా కూడా ఈ పాట చాలా బాగుందంటూ కితాబిచ్చారు. సత్యదేవ్ యాక్టింగ్ సూపర్ గా ఉందని తెలిపారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు. రానా కామెంట్ కు సత్యదేవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్ గారు చాలా ధన్యవాదాలంటూ పోస్టు చేశాడు. సత్యదేవ్ చేసినటువంటి ఈ పాటకు జెన్నిఫర్ అల్ఫాన్స్ దర్శకత్వం చేయగా జయ ఫని కృష్ణ సంగీతాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట సందడి చేస్తోంది.

Share post:

Latest