రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్…!

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ తో పాటు మరో ఇద్దరు గాయాలపాలు అయ్యారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని కన్ను మూశారు.

ఇది ఇలా ఉండగా మరో వైపు మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలియచేస్తున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి తో యాషికా ఆనంద్‌తో పాటు మరో ఇద్దరికి చికిత్స అందచేస్తునట్లు తెలుసుతుంది. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలియచేస్తున్నారు.

ఇక నటి యాషికా ఆనంద్ ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా తన కెరీర్ ను మొదలు పెట్టింది. అలాగే 2016లో దురువంగల్ పత్తినారుతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడం,అనంతరం 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో పాల్కొని తమిళ అభిమానులకు చాలా దగ్గర అయ్యేంది.

Share post:

Latest