ఒలంపిక్స్ లో భారత్ కి తొలి పథకం సొంతం.. !

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించగా.. ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను దక్కించుకున్నారు. స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లోని మీరాబాయి పతకం సాధిస్తారని అంతా ఆశించారు. కానీ ఆనాడు మీరాబాయికి నిరాశే ఎదురైంది. ఇపుడు ఆమె సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ మరికొన్ని విభాగాల్లోనూ సత్తాచాటుతున్నారు.

ఇప్పటికే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కు చెందిన సౌరవ్ చౌదరి ఫైనల్ కు అర్హత సాధించారు. భారత హాకీ జట్టు కూడా ఒలంపిక్స్ లో పైనల్ కు చేరుకుంది. ఆర్చరీ మిక్స్డ్ టీమ్ కు చెందిన దీపికా కుమారి, ప్రవీణ్ యాదవ్ చైనాను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో ఈ టీం విజయం సాధిస్తే ఫైనల్ కు చేరుకోవచ్చు.