రాజ్‌ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా.. అసలు మాటర్ ఏమిటంటే..?

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో జైలుపాలయ్యాడు. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయట పడుతుండగా శిల్పాశెట్టి వైపు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అప్ చేశారు.

వయాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం కేసులో శిల్పా ప్రమేయం ఎంత ఉంది? సంస్థకు చెందిన డబ్బు నుంచి శిల్పాకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? ‘వయాన్ ఇండస్ట్రీస్’ డైరెక్టర్‌గా శిల్ప శెట్టి ఎన్ని రోజులు పనిచేశారు? అన్న విషయాలపై క్రైమ్ బ్రాంచ్ బృందం ఫోకస్ పెట్టింది. అదేవిధంగా, యాప్‌ల కోసం డిజిటల్ కంటెంట్‌ను హోస్ట్ చేసే సర్వర్ నుంచి డాటాను తొలగించిన వ్యక్తి కోసం కూడా దర్యాప్తు బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

Share post:

Latest