ఆ కథలంటే చాలా ఇష్టం అంటున్న సమంత..?

హాస్య నటుడు అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా తెరకెక్కుతుంది. కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు రాకేశ్‌ పళిదం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబందించిన మూడో పాటను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు.

సాంగ్ రిలీజ్ చేసిన అంతరం సమంత మాట్లాడుతూ.. ‘నాకు వాస్తవంతో కూడిన జీవిత కథలంటే చాలా ఇష్టం..అలాంటి ఒక మంచి స్టోరీతో అలీ నిర్మిస్తున్న తన మొదటి చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని సామ్ చెప్పింది. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘నేను అడగ్గానే మా సినిమాలోని మూడో పాటను రిలీజ్‌ చేయడానికి సామ్ వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఆమె నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా మంచి హిట్‌ సాధించాలి అని అన్నారు. అయితే, కుటుంబ కథా చిత్రంగా నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share post:

Latest