రకుల్‌ కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రకుల్‌ప్రీత్‌ సింగ్ ఫ్యాషన్ పై చాలా దృష్టి పెడుతుంటారు. ట్రెండీ ఫ్యాషన్‌ స్టయిల్ ని మాత్రమే ఆమె పాలవుతుంటారు. ఐతే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఫేవరెట్‌ బ్రాండ్‌ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

లిమరిక్‌: అబిర్, నాన్కీ అనే ఇద్దరు డిజైనర్స్‌ కలసి “లిమరిక్‌” అనే ఫ్యాషన్ సంస్థను స్థాపించారు. లైట్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్స్‌ను తయారు చేయడంలో వీరికి వీరే సాటి. ఈ డిజైనర్స్ హ్యాండ్‌ పెయింటింగ్, సింపుల్‌ అల్లికలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ మేరకు వారు జైపూర్, సూరత్, తదితర ప్రాంతాల నుంచి నైపుణ్యం గల కళాకారులను నియమించారు. అయితే వారి కృషి, క్రియేటివిటీ కారణంగా ఆ డిజైన్స్‌ విశేషమైన గుర్తింపు దక్కించుకున్నాయి. అంతేకాదు, వారి డిజైన్స్‌కు ఇంటర్నేషనల్ స్థాయిలో డిమాండ్ పెరిగింది. దీనితో లిమరిక్‌ ఫ్యాషన్ సంస్థకు సంబంధించి అమెరికా, లండన్‌లో బ్రాంచీలు స్థాపించారు. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లలో లిమరిక్‌ డిజైన్స్‌ లభిస్తాయి.

ఆమ్రపాలి జ్యూయెలరీ: ప్రాణమిత్రులైన రాజీవ్‌ అరోరా, రాజేష్‌ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరిట ఓ మ్యూజియం స్టార్ట్ చేశారు. ఇందులో పలు సంప్రదాయ ఆభరణాలు వీక్షించవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ఆ ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆభరణాల ధర చాలా ఎక్కువగా ఉండటం వలన కేవలం సెలబ్రిటీస్ లాంటి వారు మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. రకుల్ ప్రీత్ కూడా ఆమ్రపాలి జ్యూయెలరీ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. లక్షల రూపాయల విలువైన డ్రెస్సులు ధరించినా.. అవి మనకు ఇబ్బంది కలిగిస్తే.. ఏ మాత్రం కూడా అందంగా కనిపించలేం. కాబట్టి నేను ఖరీదైన దుస్తుల కంటే కంఫర్ట్‌నిచ్చే దుస్తులు ధరిస్తా. అలాగే కంఫర్టబుల్ గా ఉండే ఆభరణాలనే ధరిస్తానని.. అప్పుడే కాన్ఫిడెన్స్‌ వస్తుందని రకుల్ ప్రీతి చెబుతుంటారు.‌

Share post:

Latest