రాజమౌళితోనే తేల్చుకుంటా..! : వి.వి.వినాయక్

డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రీమేక్ మూవీ కోసం ఛత్రపతి ఒరిజినల్ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారని వి.వి.వినాయక్ ఇటీవలే వెల్లడించారు. ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి హిందీ సినిమాలకు రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కి బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి పై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆయన ‘ఛత్రపతి’ రీమేక్‌కు ఇన్‌పుట్స్ ఇచ్చారని దర్శకుడు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విజయేంద్రతో కలిసి స్క్రిప్టు గురించి సుదీర్ఘమైన చర్చలు జరిపామని.. అనంతరం ఆయన కొన్ని చేంజస్ సూచించారని దర్శకుడు వెల్లడించాడు.

అయితే ‘ఛత్రపతి’ సినిమాని తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళితో కూడా చర్చించేందుకు తాను ప్రయత్నించానని కానీ ఖాళీ సమయం దొరకక ఇంకా ఈ సినిమా గురించి ఆయనతో మాట్లాడలేదని వి.వి.వినాయక్ చెప్పుకొచ్చారు. త్వరలోనే రాజమౌళితో ఒకసారి కూర్చొని రీమేక్‌ను ఎలా రూపొందించాలో తేల్చుకుంటానని వినాయక్ తెలిపారు.

Share post:

Latest