టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న‌ పాయ‌ల్ ప్రియుడు..త్వ‌ర‌లోనే..?

పాయ‌ల్ రాజ్‌ పూత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపి భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ చిత్రం త్వ‌రాత‌ వ‌రుస సినిమాలు చేసినా పాయ‌ల్ హిట్ అందుకోలేక‌పోయింది.

వ‌రుప ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈ బ్యూటీ మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ‌..ఆది సాయికుమార్‌తో కిరాత‌క సినిమాలో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. పాయ‌ల్ పంజాబి నటుడు, గాయకుడు అయిన సౌరభ్ ధింగ్రా తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

పాయల్ ఏ షూటింగ్‌కు వెళ్లినా, ఏ లొకేషన్‌కు వెళ్లినా అమెతో పాటు సౌరభ్ ఉంటారు. అయితే ఇప్పుడు సౌర‌భ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. తెలుగులో హీరోగా చేయాలని సౌరభ్ ఆస‌క్తి చూపుతుండ‌డంతో.. తనకి గల పరిచయాలను ఉపయోగించి ఒక ప్రాజెక్టును పాయ‌ల్ ప్రియుడికి సెట్ చేసిందని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు రానున్నాయి.