భారీ రేటుకు అమ్ముడైన `మేజర్` హిందీ శాటిలైట్ రైట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్‌, డైరెక్ట‌ర్ శశి కిరణ్ తిక్కా కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం మేజ‌ర్‌. శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నాయి.

26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్‌ను రూ. 10 కోట్లకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువ‌ల్ల‌నే, ఇంత భారీ రేటుకు మేజ‌ర్ హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడ‌య్యాయ‌ని తెలుస్తోంది.

Share post:

Latest