న్యూ మహేశ్ లుక్స్.. హిట్ గ్యారంటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు హ్యాపీనెస్ ఇచ్చేసింది. ఇదిగో ఫస్ట్ లుక్ అంటూ అలర్ట్ పోస్టు పెట్టిన చిత్ర యూనిట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసేసింది. అది చూసి మహేశ్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక అసలైన బ్లాస్ట్ ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే రోజున ఉండబోతున్నదని మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పేర్కొంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహేశ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కలిగి ఉన్నాడు. స్టైలిష్ డ్రెస్సింగ్‌తో పాటు హెయిర్ స్టైలింగ్ చూస్తుంటే పూరీ జగన్నాథ్ ‘పోకిరి’ సినిమా గుర్తొస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ హీరోయిన్ కీర్తిసురేశ్ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Popular