ప్రియుడి ఇంటికి వెళ్లిన కియారా..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ఆమె సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు సెల్యూట్‌ చేశాడు. అప్పుడు ఆమె తాపీగా కారు నుంచి దిగి భవంతి లోపలికి వెళ్లింది. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా కావ‌డంతో.. కియారాపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా?, ఓ వృద్ధుడితో డోర్ తీయించుకోక‌పోతే మీరు డోర్ కూడా తీసుకోలేనంత పెద్దోళ్లయ్యారా? అంటూ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. దాంతో కియారా మ‌రోసారి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది.

https://www.instagram.com/p/CQ_zmKxFpJa/?utm_source=ig_web_copy_link

Share post:

Popular