గృహిణుల కోసం రంగంలోకి కమల్..?

మహిళల అభ్యున్నతికి పాటుపడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అధికార డీఎంకే పార్టీని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం గృహిణులకు ప్రతినెలా రూ.1000లు చెల్లించే పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.

పనులు దొరకక.. డబ్బులు లేక సామాన్య జనాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తినడానికి తిండిలేక కొందరు పస్తులు ఉంటున్నారు. ఇంకో వైపు నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. వీటివల్ల సామాన్యుడు బతుకే భారమయ్యింది. ఈ పరిస్థిని చూసిన కమల్ ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ కఠిన సమయంలో ప్రభుత్వం ముందుకు వచ్చి ఎన్నికలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. తక్షణమే ఆ పథకాన్ని అమలు చేసి రాష్ట్రంలోని మహిళల జీవితాల్లో ఆనందం నింపాలని కమల్ అన్నారు