30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అలా క‌నిపించ‌బోతున్న క‌మ‌ల్‌?!

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `విక్ర‌మ్‌`. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి, ఫాహద్‌ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్ కెరీర్‌లో 232వ చిత్రంగా ఇది తెర‌కెక్కుతోంది.

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో క‌మ‌ల్ అంధుడి పాత్ర పోషించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రంలో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. అయితే సినిమాలో సగభాగం వరకు అంధుడుగా కనిపిస్తారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కాగా, 1981లో వచ్చిన ‘రాజపార్వై’ చిత్రంలో క‌మ‌ల్‌ అంధుడిగా నటించి.. ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నారు. అయితే 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న అంధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Share post:

Latest