యాంకర్‌ హరితేజ భర్త ఎంటి ఇలా అయ్యాడు…?

యాంకర్‌, ప్రముఖ నటి హరితేజ కొన్నిరోజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి చిన్నారి ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌ రావు అని నామకరణం చేసినట్లు తెలపండి. నామకరణం కార్యక్రమం జరిగినా కానీ పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్‌ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌ రావు పాపను ఆడిస్తున్న కొన్ని వీడియోలను, ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా హరితేజ షేర్‌ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఆ వీడియోలో దీపక్‌ రావు కూతురిని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా.. ఇలా రోజూ ఆడించడం అలవాటుపడిన ఆయన.. ఒకసారి చేతుల్లో కూతురు లేకపాయినసరే దీపక్ అదేపనిగా చేతులు ఊపుతుంటాడుడని ఈ ఫన్నీ వీడియోని హరితేజ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోకు ‘ఫాదర్‌ ఆన్‌ డ్యూటీ’ అని హాష్‌ ట్యాగ్‌ కూడా ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ‘క్యూటెస్ట్‌ డాడీ’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.