వైరల్ : రెండోసారి తండ్రైన హర్భజన్..!

ఇండియన్ మాజీ క్రికెటర్, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్‌న్యూస్ ని హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి 2016వ సంవత్సరంలో ఈ దంపతులిద్దరికీ ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు హినయ అని నామకరణం చేశారు.

అయితే తాజాగా ఓ మగ బిడ్డకు తండ్రి అయిన హర్భజన్ సింగ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని.. బాబు, తల్లి క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అందమైన సాక్స్ ల ఫొటోతో పాటు ఒక స్వీట్ పోస్ట్ తన అభిమానులతో ఆయన పంచుకున్నారు. తమ కుటుంబంలోకి మరో బిడ్డ రాక తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని.. తమ హార్ట్స్ ఆనందంతో పొంగిపోతున్నాయని, తమ జీవితం పరిపూర్ణమైందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన బిడ్డను తమకు ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు కూడా ఆయన తెలిపారు.

Share post:

Popular